కాంగ్రెస్ వద్ద నిరుద్యోగ నిర్మూలనకు స్పష్టమైన కార్యాచరణ, పక్కా ప్రణాళిక ఉందని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. సామాజిక, ఆర్థిక సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించలేదని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చిదంబరం ఇలా స్పందించారు.
నిరుద్యోగాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ వద్ద పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలను మేనిఫెస్టోలో స్పష్టంగా వెల్లడిస్తామని చెప్పారు. ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆశ్చర్యంగా ఉన్నాయి. అది బీజేపీ అధికారిక ప్రకటన అయితే వెంటనే సీటు ఖాళీ చేయండి. మా వద్ద నిరుద్యోగ నిర్మూలనకు స్పష్టమైన కార్యాచరణ ఉంది’ అని తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సమస్యలను సాల్వ్ చేసేందుకు కాంగ్రెస్ వద్ద స్పష్టమైన ప్లానింగ్ ఉందని, మేనిఫెస్టోలో ఈ అంశాలన్నీ పొందుపరుస్తామని తెలిపారు. కాగా, అంతకుముందు నాగేశ్వరన్ మాట్లాడుతూ..సామాజిక, ఆర్థిక సవాళ్లను ప్రభుత్వ