తెలంగాణ భవిష్యత్తు బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మేం గెలిచాం. తెలంగాణలో 8 సీట్లు గెలిచాం.. ఆరు నుంచి ఏడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచాం. గతంలో రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజిగిరిలో మాకు నాలుగు లక్షల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగింది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పేరుతో మజ్లిస్ పార్టీ పోటీ చేసిందని ఆయన విమర్శించారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని చెప్పారు. అదే మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌కు ఒక శాతం ఓట్లు పెరిగితే.. తమకు మాత్రం 2.5 రెట్లు పెరిగాయని తెలిపారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోయిందని పేర్కొన్నారు.