Homeహైదరాబాద్latest Newsమనకు ఏం కావాలో అడిగి తీసుకోవాలి.. అది పేమెంట్ అయినా లేదా క్రెడిట్ అయినా :...

మనకు ఏం కావాలో అడిగి తీసుకోవాలి.. అది పేమెంట్ అయినా లేదా క్రెడిట్ అయినా : దేవిశ్రీప్రసాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‏గా నటించింది. తాజాగా ఈ సినిమా వైల్డ్‌ఫైర్ ఈవెంట్ చెన్నైలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా స్పెషల్.. ‘పుష్ప 2’ సినిమా కోసం మొత్తం ప్రపంచం ఎదురుచూస్తుంది అని అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఫాన్స్ ని ఉద్దెశించి మాట్లాడుతూ… తమ్ముల్లో… కరెక్ట్ మీరు చేసింది.. మనకు ఏం కావాలో అడిగి తీసుకోవాలి..అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయన.. స్క్రీన్ మీద మనకి వచ్చే క్రెడిట్ అయినా.. మేటర్ ఏంటంటే మనం ఎంత ఎత్తు ఎదిగిన.. మీ అందరి తోడు ఉంటె మనలని షేక్ చేశా వాళ్ళు ఉండరు అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. ఈ సినిమా నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే చెప్పాను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని వేరే లెవెల్లో ఉంటుంది ఈ స్క్రిప్ట్ అని మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. మన అల్లు అర్జున్ నటన ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇంకా ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్ గ ఉంది అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.

Recent

- Advertisment -spot_img