గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతుంది. ఈ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. ఎక్కడనుండి వచ్చామో మర్చిపోకూడదు కదా.. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్న.. రామ్ చరణ్ ఉన్న..ఏ హీరోలు ఉన్న సరే.. దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు ఈరోజు og అనండి ..కళ్యాణ్ బాబు అనండి.. డిప్యూటీ సీఎం అనండి దానికి మూలం చిరంజీవి ఒక్కరే.. నేను ఎప్పుడు నా మూలాలు మర్చిపోను అని పవన్ కళ్యాణ్ అన్నారు. శంకర్ గారు తీసిన ‘జెంటిల్ మాన్’ సినిమా టికెట్ బ్లాక్ కి కొన్నుకుని సినిమా చూసాను. భారతదేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది అంటే.. శంకర్ తమిళ నుండి వచ్చి తెలుగులో డబ్ చేసి ఆ సినిమాని తెలుగు జనాలు ఇది తమిళ సినిమా కాదు తెలుగు సినిమా అని గుండెళ్ళో పెట్టుకుని ఆదరించారు. అలంటి శంకర్ ఇప్పడు తెలుగులో చరణ్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ నడపడానికి ఇందనగా పని చేసింది ‘వకీల్ సబ్’ సినిమా. అలాంటి సినిమా ఇచ్చిన దిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు తెలిపారు. రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటోడు.. చిన్నపుడు నేను బాగ ఏడిపించేవాడిని. రామ్ చరణ్ 7 ఏళ్ల వయసులో పొద్దునే హార్స్ రైడింగ్ చేసేవాడు. రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్సర్. ‘రంగస్థలం’ సినిమాకి పెర్ఫార్మెన్స్ చూసి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావాలని అనిపించింది. భవిష్యత్తులో ఉత్తమ నటుడి అవార్డును అందుకుంటాడు. తండ్రి మెగాస్టార్ అయితే.. కొడుకు గ్లోబల్ స్టార్ అని పవన్ కళ్యాణ్ అన్నారు.