వైజాగ్ : డ్రగ్స్ కేసు సీబీఐ వర్సెస్ వైజాగ్ పోలీస్‌గా మారింది. విచారణలో జాప్యానికి పోలీసులే కారణమని FIRలో సీబీఐ పేర్కొంది. వైజాగ్ సీపీ రవి శంకర్ (Ravi Shankar) దీనిపై స్పందించారు. డాగ్ స్క్వాడ్ అవసరం అని పిలిస్తేనే వెళ్లామన్నారు. తమ పరిథిలో లేని ప్రైవేట్ పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లామని చెప్పారు. గంజాయి రవాణాకు స్మగ్టర్లు వైజాగ్‌ను ఎంచుకుంటున్నారన్నారు.