శ్రీరామనవమి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో వేడుకలు జరుగుతుండటం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. దేశంలో ధ్వంసం చేసిన గుడులన్నిటినీ త్వరలోనే పునర్నిర్మిస్తామని చెప్పారు. ఆలయాల అభివృద్ది, పునర్నిర్మాణం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టాన్ని మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.