– అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్
ఇదేనిజం, కరీంనగర్ టౌన్: రైల్వే అధికారులకు తాము సహకరిస్తామని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ పేర్కొన్నారు. కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల విషయంలో తాము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రైల్వే అథారిటీ అధికారులు, ఇరిగేషన్, మైనింగ్ శాఖ అధికారులతో రైల్వే లైన్ పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఉప్పర మల్యాల, గర్షకుర్తి గ్రామాల్లో కొత్తపెల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ కు సంబంధించిన భూ సేకరణ దాదాపు పూర్తయిందని తెలిపారు. దానికి సంబంధించిన రూ. 58 కోట్లు రైల్వే శాఖ డిపాజిట్ చేస్తే వెంటనే భూమి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సీఈ ప్లానింగ్ అమిత్ అగర్వాల్, కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, మైనింగ్ ఏడీ రామాచారి, రైల్వే అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.