Hyderabad : సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. జులైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సైబర్ టవర్స్‌లో పీఎస్‌ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్‌హబ్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఏఐలో విస్తృత పరిశోధనలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఐటీ ఇండస్ట్రీలో బెంగళూరును మించి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అవసరాలు తీర్చుతామన్నారు. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.