ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్రం నుంచి సహాయ సహకారాల కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఏపీకి 975 కి.మీ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో పర్యాటక రంగాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్న డిప్యూటీ సీఎం తెలిపారు. గండికోట లాంటి వారసత్వ ప్రాంతాలను అభివృద్ధితో పాటు రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.