పాక్ అక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలుపుతామని అస్సాం సీఎం హేమంత బిశ్మ శర్మ అన్నారు. 400 సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తే శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. అంతేకాకుండా వారణాసిలో బాబా అలయాన్ని సైతం నిర్మిస్తామని చెప్పారు. మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.