తెలుగు సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రియాంక వివాదంలో చిక్కుకుంది. తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ప్రియాంక యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తుంది.అయితే ఇటీవలే ఆమె తిరుమలలో చేసిన ప్రాంక్ వీడియో కారణంగా పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా ఈ వివాదంపై ప్రియాంక స్పందించింది. నడకదారిలో ప్రాంక్ వీడియో పై ప్రియాంక,శివ క్షమాపణలు చెప్పారు. తాము కావాలని చేయలేదు కొంత మందిని వినోదపరుద్దామని చేసాము అని తెలిపారు. ఈ విషయంపై సారీ చెప్తున్నాను.. మాకు వెంకన్న స్వామి మీద అపారమైన భక్తి ఉంది అన్ని ప్రియాంక,శివ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి చేయము అని ప్రియాంక తెలిపారు.