ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాలు చేపట్టినవారు ఎంతటివారైనా వదిలిపెట్టమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు హాజరై మాట్లాడుతూ.. ‘చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలనే హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆక్రమణలు వదిలి గౌరవంగా తప్పుకోండి. వాటిని కూల్చే బాధ్యత తీసుకుంటాం. స్టే తెచ్చుకున్నా.. కోర్టుల్లో కొట్లాడతాం. మూసీ పరివాహకం వెంట పేదల ఆక్రమణలు ఉన్నాయి. వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తాం’ అని అన్నారు.