ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసారు. గుంటూరులో ఏర్పాటు చేసిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు…IASలకు వార్నింగ్లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతాం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ..అధికారులను ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకున్నారు. అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోం.. అంటూ వైసీపీ పై విరుచుకుపడ్డారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కోరితే భద్రత కల్పిస్తాం. ఎందుకంటే..మహిళల సంరక్షణే మా మొదటి ప్రాధాన్యత. మహిళా సంరక్షణకు ఏం చేయాలనే దానిపై ప్రభుత్వంలో చర్చ సాగుతోంది. మహిళలపై దాడులు జరగకుండా ఉండాలంటే ఆత్మరక్షణ తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వయసు నుంచే బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
అటవీ శాఖకు పూర్తి సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అడవులను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. అటవీ శాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. అటవీశాఖకు వివిధ సంఘాల నుంచి రూ.5కోట్ల విరాళం సేకరిస్తామని, భవిష్యత్తులో అటవీ అమరవీరులకు నివాళులర్పించేందుకు స్థూపాలు నిర్మిస్తామన్నారు.