Homeహైదరాబాద్latest Newsప్రజలందరి భాగస్వామ్యంతో చెరువులకు పునరుజ్జీవనం కల్పిస్తాం : ఏవీ రంగనాథ్

ప్రజలందరి భాగస్వామ్యంతో చెరువులకు పునరుజ్జీవనం కల్పిస్తాం : ఏవీ రంగనాథ్

ప్రజలందరి భాగస్వామ్యంతో చెరువులకు పునరుజ్జీవనం కల్పిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఎవి రంగనాథ్ గురువారం హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో నివసించే కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ శాఖలు పాల్గొని చెరువులను పునరుద్ధరిస్తారన్నారు. పర్యావరణానికి చెరువులే ఆదరువు అని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెరువు తల్లి అని అభివర్ణించారు. ఆ చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపడుతున్నట్లు ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img