Homeజాతీయందేశంలోనే అతిపెద్ద పార్టీగా నిలుస్తాం.. తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం: అమిత్ షా

దేశంలోనే అతిపెద్ద పార్టీగా నిలుస్తాం.. తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం: అమిత్ షా

తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ, ఒడిశాలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుందని అమిత్ షా చెప్పారు. అటు దక్షిణాదిలోని 5 రాష్ట్రాలు, తూర్పు భారత్ (బెంగాల్, ఝార్ఖండ్, బిహార్, ఒడిశా)లో తాము అతిపెద్ద పార్టీగా నిలుస్తామన్నారు. 2014, 2019 మాదిరిగానే ఈసారి కూడా విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ 400 సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img