Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం

తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం

– ఇండియా కూటమి కకావికలం
– బీఆర్ఎస్​ పార్టీని పట్టించుకొనే నాథుడే లేడు
– సర్పంచ్​లకు గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు
– వారి పోరాటానికి మద్దతు ఇస్తాం
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​

ఇదేనిజం, కరీంనగర్​: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 10 స్థానాలు తాము గెలుస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి కకావికలం అవుతోందన్నారు. సర్పంచ్​లకు గత ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్​ పార్టీని ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. గత ప్రభుత్వం సర్పంచ్​ లకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం హయంలోనే సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. ఎన్డీఏ కూటమి 400, బీజేపీ 350 సీట్లు గెలుస్తుందని చెప్పారు. కరీంనగర్​ లో బీజేపీకి అభ్యర్థి లేడని.. అందుకే పక్క జిల్లా నుంచి తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో కేసీఆర్​ ఎలా సీఎం అవుతారో .. కేటీఆర్​ చెప్పాలని డిమాండ్​ చేశారు. తాగి ప్రభుత్వాన్ని నడిపినందుకే కారు షెడ్డు కి పోయిందని చెప్పారు. గత ప్రభుత్వం సర్పంచుల సమస్యలు పట్టించుకొలేదని, సర్పంచ్​ల సమస్యలు ఈ ప్రభుత్వం అయిన పట్టించుకొవాలన్నారు. కోట్ల రూపాయల నిధులు దారి మళ్లుతున్నాయని చెప్పారు.

Recent

- Advertisment -spot_img