weather:ఈరోజు ఉత్తర – దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య ప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది .ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ,ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 40°C నుండి 42 °C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ వాతావరణం..
హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38°C నుండి 40°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.ఈ రోజు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు ( గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ ) తో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.