తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి తీవ్రత సూర్యోదయం నుండి కనిపిస్తుంది. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ వారం ఏపీ, తెలంగాణల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున సాయంత్రం వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు.