Weather Report: రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది.రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణకు ఇవి విస్తరించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు.. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ పశ్చిమ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. పశ్చిమ హిమాలయాలు, మధ్యప్రదేశ్ తూర్పు భాగం, విదర్భ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ హీట్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. వారికీ కూడా కొంత ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.