Weather information: తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రారంభం కాకముందే వేడిగాలులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాబోయే మూడు రోజులు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో 36 డిగ్రీల సెల్సియస్, ఏపీలోని కర్నూలు జిల్లాలో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.