HomeజాతీయంWeather Report: రైతులకు చల్లని కబురు.. ఇండియాలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు..

Weather Report: రైతులకు చల్లని కబురు.. ఇండియాలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు..

నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రం మీదుగా పయనించిన రుతుపవనాలు ఈరోజు కేరళ తీరాన్ని తాకాయి. ఇంకో నెల రోజుల్లో భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ పవనాలు వ్యాపిస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3, 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఏపీలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అయితే మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకాయని వాతావరణ శాఖ చెప్పడం రైతులకు ఊరట కల్పించినట్లయ్యింది.

Recent

- Advertisment -spot_img