మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చునని.. ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజుల గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్‌లలో ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.