వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలు ఉంటాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రాష్ట్రంలో తీవ్రమైన ఉక్కపోత, వేడిమి వాతావరణం ఉంటుందని తెలిపింది. కాగా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.