ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు విస్తరించి ఉన్న నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది.