తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అలాగే రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.