రాజస్థాన్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. భానుడి భగభగలకు జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలోడిలో గత 24 గంటల్లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జైపూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ రాధేశ్యామ్ శర్మ వెల్లడించారు. ఈ ఏడాది ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.