తెలంగాణలో రానున్న మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ మరో 4, 5 రోజులు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు 3, 4 రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నాయి.