తెలంగాణలో వర్షాలతో కొంత ఉపశమనం లభించగా ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. నిన్న చాలా జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 44.9, హాజీపూర్లో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.