Weather Report Today: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే ఐదు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు, ఉబ్బసం, మానసిక అనారోగ్యం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా పని ఉంటే ఉదయం 11 గంటల ముందు, సాయంత్రం 4 గంటల తర్వాత చేయాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.