Weather update: తెలంగాణలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, నేడు మరియు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఆదిలాబాద్‌లో నిన్న ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.9 డిగ్రీలు ఎక్కువై, 43.8 డిగ్రీలుగా నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.