Weather update: తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనితో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి మరియు హైదరాబాద్‌లలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని వెల్లడించారు.