Weather updates: వేసవి ప్రారంభం కాకముందే వేడిగాలులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో పాటు ఉక్కపోత తీవ్రత కూడా క్రమంగా పెరుగుతున్నది. తెలంగాణలోని 22 జిల్లలో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. ఏపీలో కూడా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి.