Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వేసవి రాకముందే ఎండలు భగభగ మండిపోతున్నాయి. తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35-37 డిగ్రీల మధ్య నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీలు, కొత్తగూడెంలో 37.6 డిగ్రీలు రికార్డు అయింది. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కర్నూలులో 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ALSO READ: