Homeహైదరాబాద్latest Newsవారఫలాలు (02.03.2025 నుంచి 08.03.2025 వరకు)

వారఫలాలు (02.03.2025 నుంచి 08.03.2025 వరకు)

వారఫలాలు:

మేష రాశి
ఈ వారం ఈ రాశివారికి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు భదాయకమైన కాలం. యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం ఆవరిస్తారు. రావలసిన సొమ్ము. సమకూరుతుంది. అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాగే, షేర్లలోనూ పెట్టుబడులు పెడతారు, సంతానం వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులు, సోదరీల నుంచి మరింత ఆదరణ లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు, వైద్యసేవలు, వ్యాపార విస్తరణ కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు దేవడతారు. ఉన్నతాధికారులు మరింత చేయూతనందిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడుల నుంచి విముక్తి మహిళలకు వివాదాలు తీరతాయి. విష్ణుధ్యానం చేయండి.

వృషభ రాశి
ఈ వారం ఈ రాశివారికి చేపట్టిన కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి, హెూదాలు కలిగిన వారు సహాయపడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రవిచిత్ర సంఘటనలతో అశ్చర్యపోవడం మీనండు. రావలసిన పైకం అందుతుంది. అలాగే, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. మీ పై ఇంతకాలం అభందాలు మోపిన వారే ప్రశంసిస్తారు. దూరపు బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వివాహ వేడుకలకు ఏర్పాట్లలో మునిగితేలతారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలలో మార్పులు తప్పవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మహిళలకు రాస్త అనుకూల సమయమనే చెప్పాలి. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మిధున రాశి
ఈ వారం ఈ రాశివారికి కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మిత్రు లతో ఉత్సాహంగా గడుపుతారు. ఓర్పు, నేర్పుతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధిస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. అవసరాలకు తగినం తగా సొమ్ము సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణబారలు తొలగుతాయి. కుటుంబంలో అందరి ఆమోదంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. భార్యా భర్తలు, సంతానపరంగా ఇబ్బందులు, సమస్యలు తీరతాయి. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. కొంత నలత తప్పకపోవచ్చు. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారస్తులకు అశించిన విధంగా లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములను ఆకట్టుకుంటారు. ఉద్యోగ విధుల్లో ఎదురుండదు. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు, మహిళలకు ఆస్తి లేదా ధనలాధ సూచనలు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి
ఈ వారం ఈ రాశివారికి చేపట్టిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. గృహ నిర్మాణాలలో సమస్యలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. అవసరాలకు లోటు లేకుండా గడిచిపోతుంది. పేర్ల విక్రయాలు లాభించి కొంత సొమ్ము అందుతుంది. మీపట్ల కుటుంబసభ్యుల్లో ఉన్న బేధభావం తొలగుతుంది. మీ ప్రజ్ఞాపాటవాలు గుర్తిస్తారు. బంధువులు కూడా సహకరించే వీలుంది. భార్యాభర్తల మధ్య మరింత సభ్యత నెలకొంటుంది. స్వబ్బ అనారోగ్యం. వైద్యసేవలు స్వీకరిస్తారు. వ్యాపారాలు మొదట్లో స్వల్ప లాభాలు అందినా క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. మీ సమర్థత పదిమంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

సింహ రాశి
ఈ వారం ఈ రాశివారికి కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా పట్యదలతో అధిగమిస్తారు. వాహన యోగం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ప్రయా ణాలలోనూ పరిచయాలు ఏర్పడే అవకాశం ఆధ్యా త్మెర కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రు లను కలుసుకుంటారు. ఏదోవిధంగా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆస్తుల విక్రయాలలో ప్రతిష్ఠం భనతో ఇటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబంలో పెద్దల సలహాలు, సూచనలు అమలు చేస్తూ ముం దుకు సాగుతారు. సోదరులు, సోదరీలతో కొన్ని విషయాలలో సర్దుకుపోతారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వైద్యసేవలు తగ్గిస్తారు. వ్యాపారస్తులు లాభాలు అంది ఉత్సాహంగా సాగుతారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో సత్తా, ప్రతిభపైస్థాయి వారు గుర్తిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకోని పిలుపులు, ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. అంజనేయ దండకం పరించండి.

కన్య రాశి
ఈ వారం ఈ రాశివారికి మీ ఆలోచనల అమలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుని అవసరాలు తీర్చుకుంటారు. అలాగే రుణాలు తీరి ఊరట చెందుతారు. షేర్లలోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం. మీ ప్రయత్నాలకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. వివాహాది వేడుకల నిర్వహణలో ముందడుగు వేస్తారు. ఆస్తులపై తండ్రి తరపువారితో వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారస్తులకు క్రమేపీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆశించిన లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు రెట్టింపు చేస్తారు. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు సంభవం. ఉన్నతాధికారుల ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల వాతావరణం. మహిళలకు మానసిక ప్రశాంత లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించండి.

తుల రాశి
ఈ వారం ఈ రాశివారికి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వ్యాపారాలలో పెట్టుందులు పెడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులు ప్రశంసి స్తారు. వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంటారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమై సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. స్వప్చ రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సలహాలు పాటిస్తారు. వ్యాపారస్తులు క్రమేపీ లాభాల బాట పడతారు. పెట్టుబడులకు లోటు ఉండదు. ఉద్యో గ విధుల్లో ప్రతిబంధకాలు తొలిగి ఊపిరిపీల్చుకుం టారు ఉన్నతాధికారులు మీరు సహాయపడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మరింత ఉత్సాహవంతమైన కాలం, మహిళలకు ఆస్తిలాభ సూచనలు, శివపంచాక్షరి పరించండి.

వృశ్చిక రాశి
ఈ వారం ఈ రాశివారికి పనులు పూర్తి కాక ఇబ్బంది. పడతారు. ఇంటి నిర్మాణాలు కొనుగోలు యత్నాలు వాయిదా చేస్తారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తప్పకపోవచ్చు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. రావలసిన సొమ్ము అందడంలో జాప్యం, రుణయత్నాలు. మీ వ్యూహాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. అందరికీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులతో కొద్దిపాటి వివాదాలు. స్వల్ప రుగ్మతలతో ఇబ్బంది పడతారు. వ్యాపారులకు అనుకున్న విధంగా విస్తరించడంలో ఆటంకాలు ఎదురపుతాయి. ఉద్యోగాలలో తరచూ మార్పులు ఇరిగే వీలుంది. అలాగే, పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. మహిళలకు మానసిక ఆందోళన. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు రాశి
ఈ వారం ఈ రాశివారికి కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. మీపై వచ్చిన అపవారులు తొలగి ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. తరడూ ధనలబ్ది కలిగి అవసరాలు తీరతాయి. ఆస్తుల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో మీరంటే అందరూ ఇష్టులై ఉంటారు. మీ అభిప్రాయాలను మరింత. గౌరవిస్తారు. వేడుకలలో ప్రధాన పాత్ర పోషిస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. భాగస్వాములు సైతం మీకు స్వేచ్ఛనిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన ప్రమో షన్లు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహం మహిళలకు గందరగోళం తొలగుతుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకర రాశి
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు ఊహించని రీతిలో అందుకుంటాడు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. సొమ్ముకు ఇబ్బంది ఉండరు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. రుణాలు తీరి ఊరట లభిస్తుంది. ఆస్తుల విక్రయాలు కూడా పూర్తయి కొంత ధనప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఇంతకాలం నెలకొన్న వివాదాలు తీరతాయి. కొంత అస్వస్థత కలిగినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహలతో సాగుతారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న హెూదాలు రక్కవచ్చు. పైస్థాయి వాడు మరింత చేయూతనందిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కుంభ రాశి
ఈ వారం ఈ రాశివారికి నిలిచిపోయిన కొన్ని పనులు పునఃప్రారంభిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. సొంత ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపడుస్తారు. సేవాభావం పెరుగుతుంది. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆధరణాలు కొనుగోలు చేస్తారు. డబ్బుకు లోటులేకుండా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు సైతం తీరే సమయం. షేర్లలోనూ పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యం కొంత మెరుగుడలతో ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు మరింత అందుతాయి. ఉద్యోగాలలో విధుల్లో ప్రతిబంధకాలు తొలగే సమయం. మీ మాటకు ఎదురుండదు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు ఒడిదుడుకులు తొలగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీన రాశి
ఈ వారం ఈ రాశివారికి వీరికి అన్ని విషయాలలోనూ విజయాలు వరిస్తాయి. చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. భూములు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందులు నుంచి క్రమేపీ బయటపడతారు. కొన్ని రుణాలు కూడా తీరే అవకాశం ఉంది. స్తిరాస్థి క్రయవిక్రయాల ద్వారా కొంత సొమ్ము అందుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. కొన్ని రుగ్మతలు బాధించినా ఎప్పటికప్పుడు ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు మరింతగా అందుతాయి. భాగస్వాములతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగ విధుల్లో మరింత ఉత్సాహం. ఎటువంటి బాధ్యత అప్పగించినా తేలిగ్గా పూర్తి చేస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది. గణేశాష్టకం పఠించండి.

Recent

- Advertisment -spot_img