Homeహైదరాబాద్latest Newsవార ఫలాలు (23-02-2025 నుంచి 01-03-2025)

వార ఫలాలు (23-02-2025 నుంచి 01-03-2025)

వార ఫలాలు :

మేష రాశి
ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. మీ శక్తియుక్తులతో కొన్ని సమస్యల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు అనూహ్యంగా వసూలవుతాయి. కుటుంబబాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొని ఊరట చెందుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వచ్చే వీలుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హెూదాలు, గౌరవం పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. మహిళలకు శుభవార్తా శ్రవణం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభ రాశి
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం. వాహనాలు, అభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి మరింత లబ్ధి చేకూరుతుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. వ్యాపారాలు కొంతమేర పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలు ఆనందంగా గడుపుతారు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

మిధున రాశి
ఎదురు చూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. పనులు మరింత చురుగ్గా సాగుతాయి. అప్తుల రాశినుంచి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు తీరతాయి. ఉద్యోగస్తులు బాధ్యతలపై మరింత దృష్టి సాదిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు రాగలవు. మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటక రాశి
మిత్రుల నుంచి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. అనుకున్న కార్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలలో హదావిడిగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. కాంట్రాక్టర్లకు మరింత అనుకూల పరిస్థితులు. వాహనాలు, కొనుగోలు చేస్తారు. ఆదాయానికి వద్ద ఇబ్బందులు తీరే సమయమిదే. సోదరులతో అత్యంత ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనూహ్యంగా ఒక వ్యక్తి మీకు ఆర్థికంగా చేయూతనిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు మరింత వేగవంతంగా కాగలవు. ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు అందనాలు నిజమయ్యే సమయం. గణేశాష్టకం పఠించండి.

సింహ రాశి
కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలాపడతారు. బంధువర్గం ఒత్తిడులు పెంచుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశ పరుస్తుంది. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణ దాతలను ఆశ్రయిస్తారు. నిరుద్యోగుల ప్రతి ప్రయత్నంలోనూ అవాంతరాలు వ్యాపారాలు సాదాసీదాగా సాగి నక్షబ్బ లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో మరింత అప్రమత్తత, బాధ్యతగా మెలగాలి. రాజకీయవేత్తలు, కళాకారులకు కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించండి.

కన్య రాశి
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. మీపై గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలించి శత్రువులు కూడా మిత్రులుగా. మారతారు. పరిచయాలు పెరుగుతాయి. శాస్త్రపరి శోధన విషయాలలో ఆసక్తి చూపుతారు. వివాహాది. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఆర్థి కంగా ఇబ్బందులు తీరి కొంత పొదుపు చేసే వీలుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుం టారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు వీడి ముందడుగు వేస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవార్తలు, మహిళలకు మానసిక ప్రశాంతత, శివాష్టకం పఠించండి.

తులా రాశి
కొత్త వ్యవహారాలు దేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. అప్పుల నుంచి శుభవర్తమానాలు రాగలవు. ఒక ఆలోచన మీ జీవితంలో మలుపునకు కారణమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శివానంద లహరి పారాయణ చేయండి.

వృశ్చిక రాశి
మొదట్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, క్రమేపీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. కాంట్రాక్టర్లు, వైద్యులు పేరుగడిస్తారు. విద్యార్థులు చేజార్చుకున్న అవకాశాలు తిరిగి సాధిస్తారు. పట్టుదల, ధైర్యంతో కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు. ఆృధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. నగలు, ఇతర విలువైన వస్తువులు కొంటారు. ఆర్థిక పరిస్థితి వారం మధ్య నుండి పుంజుకుంటుంది. వ్యాపారాలు ఒక పద్ధతి ప్రకారం నడిపి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ పనితనం చూసి పైస్థాయి నుంచి మెప్పు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. మహిళలు మనోనిబ్బరంతో కొన్ని సమస్యలు పరిష్కరించు కుంటారు. లక్ష్మీనారాయణ అష్టకం పఠించండి.

ధనస్సు రాశి
ఏ కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు, సేవాకార్యక్రమాలు చేపడతారు. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు కీలక సమాచారం ఊదటనిస్తుంది. ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్చిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో వేగం పెరుగుతుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్యసమస్యలు తీరతాయి. ఆర్థికంగా క్రమేపీ బలపడతారు. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారస్తులు ఉత్సాహంగా విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ఉత్సాహంగా సాగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. మహిళలకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఋణ విమోచన అంగారక స్తోత్రం పఠించండి.

మకర రాశి
కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఊహించని పిలుపు ఆలోచనలు అమలులో అవాంతరాలు తొలగుతాయి. చాకచక్యంగా ముందుకు సాగి సమస్యలు అధిగమిస్తారు. కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణ. ధూవ్యవహారాలలో చిక్కులు వీడి ఉపశమనం పొందుతారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలసువుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలించే సమయం. మీపై ఉన్న ప్రతికూలత తొలగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అతలు విగురిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. సూర్యాష్టకం పఠించండి.

కుంభ రాశి
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు. అప్తల నుంచి కీలక సమాచారం అందుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం పొందుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల విస్తృతిలో భాగస్వాముల చేయూత లభిస్తుంది. ఉద్యోగుల సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం. మహిళలకు సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి, ఆంజనేయ దండకం పఠించండి.

మీన రాశి
వ్యయప్రయాసలు ఎదురైనా అధిగమిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని విలబడుతూ పనులు పూర్తి చేస్తారు. అత్మీయుల నుంచి కీలక విషయాలు. గ్రహిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు పరిష్కారం. ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి, వాహనాలు, స్థలాల కొనుగోలు యత్నాలు సఫలం. నూరిన ఉద్యోగలాభం, వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు కొలిక్కి వస్తాయి. మహిళలకు ధన ప్రాప్తి శ్రీరామస్తోత్రాలు పఠించండి.

Recent

- Advertisment -spot_img