మేషం:
ఈ వారం ఈ రాశి వారికీ పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అందరి నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. నిర్ణయాల అమలులో జాప్యం వద్దు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో తలెత్తిన సమస్యలను చాకచక్యంతో అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు చర్యలు చేపడతారు. చేపట్టిన పనిపై శ్రద్ధ చూపండి. వ్యాపారంలో లాభసూచన. అదృష్ట రంగులు ఎరుపు, బంగారురంగు. కనకధారా స్తోత్రం పఠించండి.
వృషభం:
ఈ వారం ఈ రాశి వారికీ వివాదాలు తలెత్తవచ్చు. నిగ్రహంతో వ్యవహరించండి. మాట తూలవద్దు. సమస్యలు వాటంతటవే చక్కబడతాయి. సకాలంలో పనులు చేయండి. కోరుకున్నది నెరవేరుతుంది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. శత్రుపీడ తొలగుతుంది. మిత్రులు సహకరిస్తారు. వ్యాపారంలో లాభ సూచన. అదృష్ట రంగులు నలుపు, లేత గులాబీ. లక్ష్మీదేవి ఆరాధన ఉత్తమం.
మిథునం:
ఈ వారం ఈ రాశి వారికీ కుటుంబంలో ఘర్షణలు మానసిక అశాంతి కలిగిస్తాయి. ఓర్పు వహించండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొండి. అంతా మంచే జరుగుతుంది. ప్రయాణ సూచన. వారం మధ్యలో ఒత్తిళ్ళు పెరుగుతాయి. అనుకున్నంత ఆదాయం సమకూరదు. ఖర్చులు అధికమవుతాయి. అదృష్ట రంగులు తెలుపు, ఆకుపచ్చ. ఈశ్వర ఆరాధన ఉత్తమం.
కర్కాటకం:
ఈ వారం ఈ రాశి వారికీ ఒత్తిడులు పెరుగుతాయి. పనులు సజావుగా సాగవు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దైవ సహాయం లభిస్తుంది. వివాదాలు తలెత్తుతాయి. సహనం పాటించాలి. వ్యాపారులకు పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు, రాజకీయనాయకులకు శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. అదృష్టరంగులు లేత ఆకుపచ్చ, నేరేడు. కనకదుర్గా స్తోత్రం పఠించండి.
సింహం:
ఈ వారం ఈ రాశి వారికీ సమస్యలు తొలగుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది. కుటుంబ సభ్యులనుంచి సహకారం లభిస్తుంది. స్థిరాస్తులు కొనే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో అనవసర వ్యయం. అదృష్ట రంగులు గులాబీ, తెలుపు.నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
కన్య:
ఈ వారం ఈ రాశి వారికీ అనుకున్నట్టుగా అన్నీ జరుగుతాయి. రాబడి బాగుంటుంది. సమస్యలనుంచి గట్టెక్కుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అనుకూలమైన కాలం. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తుతాయి. అప్రమత్తంగా ఉండండి. వ్యాపారులు లాభాలు కళ్ళచూస్తారు. అదృష్ట రంగులు గులాబీ, లేత ఎరుపు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
తుల:
ఈ వారం ఈ రాశి వారికీ అంతా అనుకూలంగా ఉంటుంది. సమస్యలు తీరతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వాహనయోగం. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. అనుకూల రంగులు ఎరుపు, లేత ఆకుపచ్చ. ఆంజనేయ దండకం, హనుమాన్‌చాలీసా పఠించండి..
వృశ్చికం:
ఈ వారం ఈ రాశి వారికీ వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభకార్య యత్నాలు చేపడతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కళారంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. వృథా వ్యయం జరుగుతుంది. అదృష్టరంగులు నీలం, ఆకుపచ్చ. దుర్గాదేవి స్తోత్రాలు పఠిస్తే మంచిది.
ధనుస్సు:
ఈ వారం ఈ రాశి వారికీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంటినిర్మాణం చేపడతారు. రాజకీయ నాయకులు అనుకున్నది సాధిస్తారు. పారిశ్రామికవర్గాల వారు రాణిస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మకరం:
ఈ వారం ఈ రాశి వారికీ అనారోగ్య సూచన. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెగుతుంది. వ్యాపారులకు నష్టం కలుగవచ్చు. నిరుద్యోగులకు అంత అనుకూలంగా ఉండదు. రాజకీయవర్గాల వారికి శ్రమాధిక్యం. కళాకారులకు పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. వారం మధ్యలో శుభ వర్తమానం అందుతుంది. అదృష్ట రంగులు నీలం, నేరేడు. శివాష్టకం, శివస్తోత్రాలు పఠించండి.
కుంభం:
ఈ వారం ఈ రాశి వారికీ పనుల్లో జాప్యం. ఆర్థిక సమస్యలు తీరతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారులకు లాభసూచన. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పు వహించండి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆదిత్యహృదయం పఠిస్తే మంచిది.
మీనం:
ఈ వారం ఈ రాశి వారు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు కలుగుతాయి. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యసూచన. ఖర్చులు పెరుగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ మంచి ఫలితం ఇస్తుంది.