Homeహైదరాబాద్latest Newsవార‌ ఫలాలు (01-09-2024 నుండి 07-09-2024 )

వార‌ ఫలాలు (01-09-2024 నుండి 07-09-2024 )

మేషం
ఈ వారం ఈ రాశి వారికిఅదృష్టయోగం ఉంది. ఆశయాలు నెరవేరతాయి. ప్రారంభించిన పనులు త్వరలో పూర్తవుతాయి. ఓ ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. వ్యాపారం విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగులు మరింత జాగ్రత్తగా పనిచేయాలి. మిత సంభాషణ మేలు చేస్తుంది. ఈ వారం దూర ప్రయాణాలు చేయాల్సి రావ‌చ్చు. వారం మ‌ధ్య‌లో శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని ధ్యానించాలి. మంచి జ‌రుగుతుంది.

వృషభం
ఈ వారం ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొంత పరధ్యానంగా ఉంటారు. నిరుత్సాహం వెంటాడుతుంది. నిరాశ నుంచి బయటపడి లక్ష్యంవైపు దృష్టి సారించాలి. నీచ శుక్రయోగం కారణంగా, ఆర్థిక సమస్యలు ఉంటాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తారు. వారాంతంలో శుభం జరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా స‌మ‌యాన్ని గ‌డుపుతారు. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. మాన‌సిక ప్ర‌శాంతత ల‌భిస్తుంది.

మిథునం
ఈ వారం మిథున రాశి వారికి అదృష్టయోగం కొనసాగుతోంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. గతంలో పోగొట్టుకున్నవి అనూహ్యంగా లభిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. మిత్రుల సహకారం అందుతుంది. వ్యాపార విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. ఆర్థిక లాభాలు అందుకుంటారు.

కర్కాటకం
ఈ వారం ఈ రాశి వారికి అదృష్ట ఫలాలు అందుతాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభ కనబరుస్తారు. వ్యక్తిగత సంభాషణలో జాగ్రత్త అవసరం. మరింత కష్టపడితే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. ఏ పనుల్నీ మధ్యలోనే ఆపకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. వారం చివర్లో ఓ మంచి వార్త వింటారు. శ్రీమహాలక్ష్మిని ధ్యానించండి. అనుకున్న ప‌నులు అనుకున్న స‌మ‌యానికి పూర్తి అవుతాయి.

సింహం
ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక ఫలితాలు ఊరటనిస్తాయి. లక్ష్యాల సాధనకు శక్తికి మించి శ్రమిస్తారు. ఏదీ లోతుగా ఆలోచించొద్దు. మాయమాటలతో పక్కదారి పట్టించేవారితో జాగ్రత్త. ప్రతి నిర్ణయానికీ పునరాలోచన అవసరం. చెడును ఊహించుకోవద్దు. ఆత్మీయులతో విభేదాలు వద్దు. ముందస్తు ప్రణాళిక అవసరం. మ‌నో ధైర్యంతో ముందుకు సాగండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కన్య
ఈ వారం ఈ రాశి వారికి వ్యాపారం విజయవంతంగా సాగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సృజనాత్మక ఆలోచనలు వరిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో లాభపడతారు. శత్రుదోషం తొలగుతుంది. మిత్రులు సహకరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసర విషయాలు జోలికి వెళ్లకండి. అందివచ్చిన అవకాశాల్ని వదులుకోకండి. ఉత్తమ ఫ‌లితాలు అందుకోవ‌డానికి అవి ఉప‌యోగ‌ప‌డతాయి. కులదైవాన్ని ప్రార్ధించండి. విజ‌యం వ‌రిస్తుంది.

తుల
ఈ వారం ఈ రాశి వారికి భవిష్యత్తు శుభప్రదం. కీలక నిర్ణయాలకు సరైన సమయం. ఉద్యోగులకు ఉత్తమకాలం. పదోన్నతి సూచనలు కనిపిస్తున్నాయి. సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారు. దీర్ఘకాలిక అన్వేషణ ఫలిస్తుంది. అనుబంధాలు మరింత బలపడతాయి. ఈవారం కీలక నిర్ణయం తీసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త. రోజూ విష్ణు సహస్రనామం చదువుకోవాలి.

వృశ్చికం
ఈ వారం ఈ రాశి వారికి మంచికాలం నడుస్తోంది. మీ నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కార్యసిద్ధి ఉంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. మంచి పెట్టుబడులు పెడతారు. సంపద వృద్ధి చెందుతుంది. విందువినోదాలతో కాలం గడుపుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.

ధనుస్సు
ఈ వారం ఈ రాశి వారికి త్వ‌రిత‌గ‌తిన‌ విజయాలు సాధిస్తారు. నకారాత్మక ఆలోచనలు వద్దు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సంభాషణలో అపార్థాలకు తావివ్వకండి. కొందరు ఇబ్బందులు సృష్టిస్తారు. వాటిని చాకచక్యంగా ఎదుర్కోండి. వారం మధ్యలో సత్ఫలితాన్ని సాధిస్తారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఆడంబరాలకు పోకండి. గాయత్రీ దేవిని ధ్యానించండి.

మకరం
ఈ వారం మకర రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యసాధనలో నిర్లిప్తత వద్దు. సకాలంలో పనులు పూర్తిచేయండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మీ మనోబలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. ఓ వార్త మీకు బలాన్ని ఇస్తుంది. ఇష్టదైవాన్ని దర్శించుకోండి.

కుంభం
మనోబలం అవసరం. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. అభీష్టం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమకాలం నడుస్తోంది. ఒత్తిడికి గురైతే పొరపాట్లకు ఆస్కారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనూహ్యమైన ఖర్చులు ఎదురవుతాయి. సూర్యనారాయణుడిని స్మరించండి.

మీనం
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సహోద్యోగుల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతారు. అధికార లాభం సూచితం. పనుల్లో పురోగతి ఉంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అన్నింటా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టాలు తప్పవు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. త్వరలో ఓ మంచి జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

spot_img

Recent

- Advertisment -spot_img