Homeహైదరాబాద్latest Newsవార ఫలాలు (13-10-2024 నుంచి 19-10-2024 వరకు)

వార ఫలాలు (13-10-2024 నుంచి 19-10-2024 వరకు)

మేషం
అత్యధిక గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తమకాలం నడుస్తోంది. ఉన్నత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలున్నాయి. అధికారుల అండ లభిస్తుంది. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. అయినా ఓపికతో వ్యవహరించండి. నవగ్రహాలను ధ్యానించండి.

వృషభం
స్పష్టమైన ఆలోచనతో పనులు ఆరంభించాలి. స్థిరత్వం అవసరం. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర విషయాల్లో కలుగజేసుకోవద్దు. మొహ మాటంతో ఆర్థికంగా నష్టపోతారు. సంభాషణా చాతుర్యం అవసరం. వ్యాపారంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. వారాంతంలో మంచి జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మిథునం
ఈ వారం వారఫలాల ప్రకారం మిథున రాశి వారికి వ్యాపార విజయాలు ఉన్నాయి. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. ధనయోగం ఉంది. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. కొత్త ప్రయత్నాలకు ముందు సమీక్ష అవసరం. తోటివారితో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. సూర్య భగవానుడిని ధ్యానించండి.

కర్కాటకం
ఉద్యోగ విధాలా మంచికాలం. పదోన్నతి సూచనలున్నాయి. ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకుంటారు. వ్యాపార నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల సలహాలు తీసుకోండి. అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.

సింహం
కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఎంతోకాలంగా పరిష్కారం కాని పనులు కొలిక్కి వస్తాయి. సృజనాత్మకమైన నిర్ణయాలు కలిసొస్తాయి. కొద్దిపాటి సాహసమూ అవసరమే. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వారం మధ్యలో ఆర్థిక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇష్టదైవాన్ని పూజించండి.

కన్య
సకాలంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ధన స్థానంలో శుక్రయోగం ఉంది. ఫలితంగా ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది. కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆలోచనల్లో స్థిరత్వం ముఖ్యం. అవరోధాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపార నైపుణ్యం పెంచుకోవాలి. దుర్గాదేవిని ఆరాధించండి.

తుల
బలమైన కృషితో విజయాన్ని సాధిస్తారు. పాత ఆలోచనా విధానం నుంచి బయటకు రావాల్సిన సమయం. జన్మరాశిలో స్వక్షేత్ర శుక్రుడు శుభయోగాన్ని ఇస్తాడు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఓ ముఖ్యమైన పని సునాయాసంగా పూర్తవుతుంది. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేసుకోవద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి.

వృశ్చికం
విజయం గోచరిస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. మీదైన ప్రతిభతో విజయాలు సాధిస్తారు. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. లక్ష్మీదేవిని ధ్యానించండి.

ధనుస్సు
ఉత్తమకాలం నడుస్తోంది. అభీష్టం సిద్ధిస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ప్రత్యర్థులు అవరోధాలు సృష్టిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. వారం మధ్యలో కలిసొస్తుంది. వినాయకుడిని పూజించండి.

మకరం
విజయావకాశాలు ఉన్నాయి. ఉత్తమ నిర్ణయాలు తీసుకోండి. రుణ సమస్యల్లో చిక్కుకోవద్దు. పొదుపు-మదుపు చాలా అవసరం. శత్రుదోషం తొలగిపోతుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. తోటివారి సహకారం అవసరం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శుక్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి.

కుంభం
ఈ వారం వారఫలాల ప్రకారం శుక్రగ్రహ యోగం ఉంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంపాదనను సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారంతోనే ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడికి గురికావద్దు. దైవానుగ్రహంతో ఓ ఆపద నుంచి బయటపడతారు. కొందరి చర్యలు చికాకుపరుస్తాయి. అయినా ఆవేశానికి గురికావద్దు. నవగ్రహాల్ని పూజించండి.

మీనం
గ్రహదోషం అధికంగా ఉంది. ఏ పని అయినా ఆలోచించి మొదలు పెట్టాలి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఏ దశలోనూ వెనకడుగు వేయకండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. వృథా ఖర్చులను అధిగమించండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి.

Recent

- Advertisment -spot_img