Homeలైఫ్‌స్టైల్‌Weight Loss And Healthy Heart : ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు, గుండె ప‌దిలం

Weight Loss And Healthy Heart : ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు, గుండె ప‌దిలం

Weight Loss And Healthy Heart : ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు, గుండె ప‌దిలం

Weight Loss And Healthy Heart : ఆరోగ్యంగా జీవించడం కోసమో, లైఫ్ స్టైల్ ఛేంజెస్ కోసమో, బరువు తగ్గడం కోసం మనం ఏదైనా డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలనుకుని ఇంటర్నెట్ లో వెతికితే ఎన్నో రకాల డైట్ ప్లాన్స్ కనబడతాయి.

అయితే, ఈ ప్లాన్స్ లో ఏది మంచిదో ఏది కాదో ఎలా తెలుస్తుంది? అయితే, యూఎస్ న్యూస్ ఎండ్ వరల్డ్ రిపోర్ట్ వారు ఏటా ఇచ్చే ర్యాంకింగ్స్ లో 2021 సంవత్సరానికి బెస్ట్ డైట్ ని రివీల్ చేసింది,

వరుసగా నాలుగోసారి ఆ ప్లేస్ ని మెడిటరేనియన్ డైట్ రిసీవ్ చేసుకుంది.

ఈ డైట్ లో మెడిటరేనియన్ రీజియన్ లోని సంప్రదాయ ఆహారం తీసుకుంటారు.

ఈజీగా ఫాలో అవ్వగలిగే డైట్, ఈ డైట్ పని చేస్తుందన్న ఎవిడెన్స్, పోషకాహార విలువలతో కూడిన సమతులాహారం..

కష్టపడకుండా బరువు తగ్గండిలా…

ఇవన్నీ కలిసి ఈ డైట్ ని ప్రధమ స్థానం లో ఉంచాయి.

పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ ఉన్న ఫుడ్ ని ఈ డైట్ లో తీసుకుంటారు.

అందువల్ల ఈ డైట్ ని హెల్దీ డైట్స్ లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు, హార్ట్ ప్రాబ్లమ్స్ తో సహా అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్ ని ఈ డైట్ దూరంగా ఉంచుతుందని చెబుతారు.

ఈ డైట్ వల్ల జీవితకాలం పెరుగుతుందని కూడా అంటారు.

ప్రతి ఏటా ఇచ్చే ఈ ర్యాంకింగ్స్ ని ఒక ప్యానెల్ డిసైడ్ చేస్తుంది.

ఈ ఇంజక్షన్ తీసుకుంటే చాలు భారీగా బరువు తగ్గేయొచ్చ‌ట‌

ఆ ప్యానెల్ లో పోషకాహర నిపుణులు, డయాబెటీస్, హార్ట్ హెల్త్, వెయిట్ లాస్ కి సంబంధించిన నిపుణులు ఉంటారు.

39 వివిధ రకాల డైట్ ప్లాన్స్ లో నుండి వీరు మెడిటరేనియన్ డైట్ ని బెస్ట్ డైట్ గా డిసైడ్ చేశారు.

ఈ 39 ప్లాన్స్ లో కీటో, వెయిట్ వాచర్స్, ఎట్కిన్స్ కూడా ఉన్నాయి.

రెండవ స్థానం డాష్ డైట్ తీసుకోగా, ఫ్లిక్సిటేరియన్ డైట్‌కి మూడవ స్థానం వచ్చింది.

ఓవరాల్ బెస్ట్ డైట్ లో ప్రధమ స్థానమే కాదు మెడిటరేనియన్ డైట్ బెస్ట్ డైట్స్ ఫర్ హెల్దీ ఈటింగ్, ఈజియెస్ట్ డైట్స్ టు ఫాలో, బెస్ట్ డైట్స్ ఫర్ డయాబెటీస్, బెస్ట్ ప్లాంట్ డైట్స్ క్యాటగిరీల్లో కూడా ప్రధమ స్థానం దక్కించుకుంది.

మిరియాలతో అధిక బరువు తగ్గండి

అయితే, కీటో డైట్, హోల్30, ఎట్కిన్స్ డైట్ వంటి బాగా సెర్చ్ చేసిన డైట్స్ మాత్రం చివరి స్థానాల్లో ఉన్నాయి.

ఈ డైట్స్ కి ఉన్న రెస్ట్రిక్షన్స్, సస్టెయినబిలిటీ లేకపోవడం వల్ల ఇలా జరిగింది.

మెడిటరేనియన్ డైట్ అంటే ఏమిటి..

యూఎస్, యూరోప్ లో ఇతర భాగాలలో నివసించే ప్రజలతో పోలిస్తే మెడిటరేనియన్ కంట్రీస్ లో నివసించే ప్రజలు కరోనరీ హార్ట్ డిసీజ్ వలన మరణించడం బాగా తక్కువగా జరుగుతోందని తెలిసిన తరువాత ఈ డైట్ ని 1960ల్లో మొదలు పెట్టడం జరిగింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ డైట్ ని హెల్దీ, ఇంకా సస్టెయినబుల్ డైటరీ ప్యాటర్న్ గా రికగ్నైజ్ చేసింది.

మెడిటరేనియన్ డైట్ బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుందనీ, హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్, టైప్ 2 డయాబెటీస్, అకాల మరణం వంటి వాటిని ప్రివెంట్ చేయగలదనీ, పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

మీకు గుండెపోటు వస్తుందా.. ఇలా తెలుసుకోండి..

ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ వంటి మెడిటరేనియన్ కంట్రీస్ లో నివసించే ప్రజలు ఫాలో అయ్యే సాంప్రదాయ ఆహారపు అలవాట్లని పాటించడమే మెడిటరేనియన్ డైట్ అంటే.

ఈ డైట్ లో ఎక్కువ పండ్లూ, కూరగాయలూ, హోల్ గ్రెయిన్స్, లెగ్యూంస్, నట్స్, ఆలివ్ ఆయిల్ ఉంటాయి.

చికెన్, ఫిష్, రెడ్ మీట్ వంటివి వారానికి ఒకసారి మాత్రమే తింటారు.

పాలూ, పాల పదార్ధాలు మోతాదు మించి తీసుకోరు, రెడ్ వైన్ కూడా తగిన మోతాదులో తీసుకుంటారు.

అయితే, మెడిటరేనియన్ డైట్ అనేది ఒక డైట్ ప్లాన్ గా మాత్రమే తీసుకోకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుండె ఆరోగ్యానికి పంచ‌ సూత్రాలు

అది ఒక లైఫ్ స్టైల్ అని చెబుతున్నారు.

ఈ ప్రదేశాల్లో నివసించే ప్రజలు క్రానిక్ డిసీజెస్ బారిన పడకుండా ఉంటున్నారంటే కేవలం డైట్ మాత్రమే కాదు, వారి జీవన శైలి కూడా అందుకు కారణమే అని చెబుతున్నారు.

వారి జీవన శైలి లో ఇక్కడ ఉన్న అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

  • ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం
  • ప్రొడక్టివ్ గా ఉండడం
  • రిలాక్స్ అవ్వడానికి సమయం ఉంచుకోవడం
  • ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో సమయం గడపడం
  • హాయిగా నవ్వడం
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
  • లైఫ్ లో సింపుల్ థింగ్స్ ని ఎంజాయ్ చేయడం.

రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే.. గుండె జబ్బులకు చెక్​

Recent

- Advertisment -spot_img