Homeహైదరాబాద్latest Newsమానవత్వం తో మనుషులందరికి యదే ఇమామ్ హుస్సేన్ ఆలైసలం యొక్క మెహ్ఫిల్ కు స్వాగతం

మానవత్వం తో మనుషులందరికి యదే ఇమామ్ హుస్సేన్ ఆలైసలం యొక్క మెహ్ఫిల్ కు స్వాగతం

ఇదే నిజం, లక్షెట్టిపేట్: ఆదివారం రోజున లక్షెట్టిపేట్ లో యాదే ఇమామ్ హుస్సేన్ అలైసాలం యొక్క మెహ్ఫిల్ ను పురస్కరించుకొని మానవులందరు ఒకటేనని మళ్ళీ గుర్తు చేశారు ఖానాక ఈ మహమ్మదీ అజ్మేరి నుస్రాతీ వారు. ఈ సందర్భంగా ఆంజాత్ చిస్టీ, ఇర్షాద్ చిస్టీ, హఫీజ్ సమధ్ చిస్త్ీ, మాట్లాడుతూ హుస్సేన్ అలైసలమ్ చేసిన త్యాగం గురించి చెప్పారు. వారి గురువైన సయ్యద్ మీర్ నుస్రాత్ అలి ఖాద్రీ, చిస్టి, సబ్రీ జామియా సాలసిల్ వారి అజ్ఞానానుసరం ఈ మెహ్ఫిల్ ను చేశారని అన్నారు. యాద్ ఏ ఇమామ్ హుస్సేన్ ఆలైసలం అనునది కేవలం ముస్లిం లా కోసం కాదని సమస్త మానవుల కోసమని చెప్పారు. వారి గురువు గారి మాట పై ఈ మెహ్ఫిల్ చేసి హిందూ ముస్లిం అని కాకుండా ప్రతి ఒక మానవుడు ఈ మెహ్ఫైల్ లో రావచ్చని చెప్పారు. అనంతరం వారి యొక్క స్మరణాన్ని గుర్తు చేసుకొనిన తర్వాత లంగర్ (భోజనం) అందరికీ అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హఫీజ్ సమాధ్ చిస్టి, అమ్హత్ చిష్టి , ఇర్షాద్ చీష్టి, రహీమ్ చీష్టి, వహీద్ చీష్టి , ఖానాక ఈ మహమ్మదీ అజ్మేరి నుస్రాతీ లక్షేటిపెట్ వారు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img