ఇదే నిజం, దేవరకొండ: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు దేవరకొండ పట్టణం నందీశ్వర నగర్ లో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ తో కలిసి ప్రచారాన్ని నిర్వహించిన దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజులలో ప్రజా ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే బాలు నాయక్ , నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గంలో చేపట్టబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దేవరకొండ నియోజకవర్గానికి సాగు, త్రాగునీరు ప్రాజెక్టులు, ఉపాధి కల్పన కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ ప్రాజెక్టులను నెలకొల్పి అన్ని రంగాలలో మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఓటర్లకు సూచించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, పరమత సహనం వంటి అనేక మానవ వికాస భావాలకు కాంగ్రెస్ పాలనలోనే పురోగతి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేతావత్ మోతీలాల్, సురేందర్, లక్ష్మణ్ నాయక్, భద్య, రాములు, కృష్ణ, శంకర్, అంజి, లక్ష్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.