పశ్చిమ్ బెంగాల్‌లోని శిలిగురి పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం త్రీవ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా వాటి పేర్లు సూరజ్,తాన్యాగా మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా బెంగాల్ అధికారులు అక్బర్,సీత పేర్లు కలిగిన రెండు సింహాలను త్రిపుర నుంచి శిలిగురి పార్కుకి తీసుకొచ్చారు.