జనగామ ఎమ్మెల్యే, BRS నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికార దాహంతో కొన్ని వందలకోట్లు పోగేసుకున్నారని ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ వద్ద రూ. 104 కోట్ల కమిషన్ తీసుకున్నారని..ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వర్సిటీలు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా మనబడి – మన ప్రణాళిక కాంట్రాక్టులు పల్లా తమ్ముడికే ఇప్పించుకున్నారని ఘాటైన విమర్శలు చేశారు. దళితబంధు పథకంలో తాటికొండ రాజయ్య అక్రమాలకు పాల్పడి, లబ్ధిదారుల నుంచి కమిషన్లు తీసుకున్నారని మండిపడ్డారు. ఈ విషయాలను నిరూపిస్తే ఇద్దరూ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. నేను కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.