Warangal MGM Hospital Latest News :
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో సమస్యలు వెంటాడుతున్నాయి. డాక్టర్లు తగినంతగా లేకపోవడంతో పేషెంట్ కేర్ సిబ్బంది చికిత్స అందిస్తున్న దీన పరిస్థితులు కనబడుతున్నాయి. ఆస్పత్రిలో రోగులు, కుటుంబీకులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.