చాట్ బండారు తినాలని ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి శుక్రవారం రాత్రి వనస్థలిపురం పనామా వద్ద ఉన్న మిఠాయి వాళ స్వీట్స్ వద్దకి వచ్చి చాట్ బండారు ఆర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. తిందామని బాక్స్ ఓపెన్ చేసి కొద్దిగా తిని చూసేసరికి చాట్ బండారులో పెద్ద బొద్దింక దర్శనమిచ్చింది. యజమానిని నిలదీశాడు. యజమాని మాత్రం నిర్లక్ష్యపు సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేసిన వారు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.