కర్ణాటకలోని కలబుర్గి పట్టణంలో ఉన్న భాగ్యమతి అమ్మవారి ఆలయంలోని హుండీలో ఓ కరెన్సీ నోటుపై రాసి ఉన్న అక్షరాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ‘అమ్మా.. మా అత్తను త్వరగా చంపు తల్లీ’ అంటూ ఓ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు. ఆ అక్షరాలు కన్నడ భాషలో ఉన్నాయి. పరకామణిలో హుండీ సొమ్మును లెక్కిస్తుండగా ఈ నోటు కంటబడింది. ఆ నోటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.