Homeహైదరాబాద్latest Newsవామ్మో.. ఒకే ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు.. హడలెత్తిపోయిన కుటుంబం.. ఎన్నో తెలిస్తే షాకవుతారు..!

వామ్మో.. ఒకే ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు.. హడలెత్తిపోయిన కుటుంబం.. ఎన్నో తెలిస్తే షాకవుతారు..!

ఇదే నిజం, భద్రాద్రి కొత్తగూడెం: ఒకే సారి కుప్పలు కుప్పలుగా పాములు చూస్తే.. ఎలా ఉంటుది. ఒక సారి ఉహించుకోండి..ఆ ఆలోచన వస్తేనే భయంగా ఉంది కదా.. భద్రాద్రి కొత్తగూడెంలో ఓ కుటుంబానికి ఇదే అనుభవమే ఎదురైంది. పాము కనపడితే చాలా మంది బెదిరిపోయి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అంతెందుకు ఫోన్‌లో పాము విజువల్ కనిపించినా హడలెత్తిపోతారు. అయితే నెహ్రూ బస్తీలోని నివాసముండే ఎలక్ట్రిషీయన్ రాజు ఇంట్లోని గోడ కన్నంలో ఏకంగా 32 ఒక్కసారిగా కనపడటంతో అంతా హడలెత్తిపోయారు.. వాటిని చూసిన రాజు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ దత్తు టీం.. ఇల్లంతా జల్లెడ పట్టి ఒక పెద్ద నాగుపాముతో పాటు 32 నాగుపాము పిల్లలను రెండు గంటలు శ్రమించి పట్టుకున్నారు.

Recent

- Advertisment -spot_img