ఉత్తరప్రదేశ్‌లోని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చీర కొనివ్వలేదని భర్త నుంచి విడాకులు కోరింది ఓ ఇల్లాలు. వివరాలలోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన ఓ జంట 2022లో వివాహం చేసుకున్నారు. ఇన్ని రోజులు వీరి కాపురం సాఫీగానే సాగింది. కానీ, గత 6 నెలలుగా అనేక కారణాలతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చీర విషయంలో మొదలైన పోరు తీవ్రస్థాయికి చేరింది. అడిగిన చీర కొనివ్వలేదని భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి చివరికి విడాకుల దాకా చేరింది.