మహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్న్ ఘాట్ వద్ద తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఐదుగురు యువకులు, ముగ్గురు యవతులు పర్యాటక ప్రాంతమైన బోర్న్ ఘాట్ వద్దకు వచ్చారు. వారిలో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి పడిపోయింది. 150 అడుగుల లోయలో ఆమె పడింది. ఆమెను అగ్నిమాపక శాఖ అధికారులు అతికష్టం మీద రక్షించారు. అదృష్టవశాత్తూ ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.