రీల్స్ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని అనుకుంది ఓ ఇంట్లో పనిచేసే పనిమనిషి. కానీ ఆమె దగ్గర మంచి కెమెరా కొనడానికి డబ్బులు లేవు. దాంతో తాను పనిచేసే ఇంటికే కన్నం వేసింది. ఢిల్లీలోని ఓ బంగ్లాలో పనిచేసే నీతూయాదవ్(30)కు సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఈక్రమంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ కావాలని యజమాని ఇంట్లో చోరీ చేసింది. రూ.లక్షల విలువైన నగలతో పరారైంది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.